ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఎంపికపై భజ్జీ ఫైర్

Arun Chilukuri
Published on: 28 Oct 2020 9:09 AM IST
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఎంపికపై భజ్జీ ఫైర్
X

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికే గాయాన్ని సాకుగా చూపి రోహిత్‌ శర్మను పక్కకు పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా సూర్యకుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేకపోవడాన్ని భజ్జీ ఖండించాడు. ఈ మేరకు ట్వీటర్‌ వేదికగా టీమిండియా సెలక్షన్‌ తీరును విమర్శించాడు. అతనికి టీమిండియా జట్టులో ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని మన సెలక్షన్‌ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన రూల్‌ను అవలంభిస్తున్నారన్నాడు. ఇందుకు ఇదే నిదర్శనమంటూ ట్వీట్ చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story