హైదరాబాద్‌లో భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌ టెన్షన్‌.. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌

IND vs AUS: క్రికెట్‌ అభిమానులతో కిక్కిరిసిన జింఖానా గ్రౌండ్‌

Jyothi
Published on: 21 Sept 2022 12:22 PM IST
Gymkhana Ground Crowded With Cricket Fans
X

హైదరాబాద్‌లో భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌ టెన్షన్‌.. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌

IND vs AUS: హైదరాబాద్‌లో భారత్‌-ఆసీస్‌ టీ 20 మ్యాచ్‌ టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న భారత్-ఆసీస్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో.. క్రికెట్‌ అభిమానులతో జింఖానా గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. మ్యాచ్‌ టికెట్ల విక్రయంలో జాప్యంపై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ HCA కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

Jyothi

Jyothi

Next Story