ఐపీఎల్ సీజన్ 16.. తొలి మ్యాచ్ లో చెన్నైపై గుజరాత్ విజయం

IPL Season 16: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ ఐపీఎల్‌-16 సీజన్‌లో ఆరంభంలోనే అదరగొట్టింది.

Dhatripriya
Updated on: 1 April 2023 8:00 AM IST
Gujarat Won The First Match With Chennai Super Kings
X

ఐపీఎల్ సీజన్ 16.. తొలి మ్యాచ్ లో చెన్నైపై గుజరాత్ విజయం

IPL Season 16: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ ఐపీఎల్‌-16 సీజన్‌లో ఆరంభంలోనే అదరగొట్టింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై రుతురాజ్‌ గైక్వాడ్ 92 పరుగులు దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హార్దిక్‌ సేన 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వృద్ధీమాన్‌ సాహా 16 బంతుల్లో 25 పరుగులు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్‌ 17 బంతుల్లో 22 పరుగులు, విజయ్‌ శంకర్‌ 21 బంతుల్లో 27 పరుగులు, రషీద్‌ ఖాన్‌ 10, రాహుల్ తెవాతియా 15 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ మూడు, రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story