క్వాలిఫయర్-2లో ముంబైపై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం..

Gujarat Titans win over Mumbai in Qualifier-2
x

క్వాలిఫయర్-2లో ముంబైపై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం..

Highlights

MI Vs GT: 62 పరుగుల తేడాతో గుజరాత్‌ గెలుపు..

MI Vs GT: అదిరే ప్రదర్శనతో గుజరాత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైతో జరిగిన క్వాలిఫయర్‌-2లో 62 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. దీంతో చెన్నైతో ఆదివారం జరగనున్న ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. 234 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్‌ అయింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 61, తిలక్‌ వర్మ 43, గ్రీన్‌ 30 పరుగులతో చెలరేగినప్పటికీ గెలిపించలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆజట్టు దూకుడుగా ఆడుతున్న సమయంలో కీలక వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. షమీ, రషీద్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. 60 బంతుల్లోనే 129 పరుగులతో అద్వితీయ శతకం సాధించాడు.

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. గతేడాది టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరోసారి టైటిల్ పోరాటానికి సిద్ధమైంది. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ 62 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 234 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా, షమీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు.

ముంబై ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ 43, కామెరాన్ గ్రీన్ 30 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్ ఘోరంగా విఫలమయ్యారు. అసలు, టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడమే ముంబై ఇండియన్స్ కు బెడిసికొట్టింది. గుజరాత్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 129 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడగా, గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది.

లక్ష్యఛేదనలో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ కు కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఊపునిచ్చినా కీలక సమయాల్లో వీళ్లు అవుట్ కావడంతో ముంబై ఓటమి దిశగా పయనించింది. సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో ముంబై చివరి బ్యాట్స్ మెన్లు ఏమీ చేయలేకపోయారు.

ఈ విజయంతో ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ రేపు టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీకి సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో ఓటమిపాలైన గుజరాత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందో, లేక చెన్నైకి మరోసారి దాసోహం అంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories