RR vs GT: రాజస్థాన్‌కు షాక్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

RR vs GT: రాజస్థాన్‌పై 3వికెట్ల తేడాతో గెలుపొందిన గుజరాత్

Jyothi
Published on: 11 April 2024 7:19 AM IST
Gujarat Titans beat Rajasthan Royals by 3 wickets
X

RR vs GT: రాజస్థాన్‌కు షాక్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

RR vs GT: ఐపీఎల్‌లో వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు బ్రేక్‌ పడింది. గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్‌రాయల్స్‌పై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ 76 పరుగులు, సామ్సన్‌ 68 పరుగులు సాధించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ 72 పరుగులు సాధించగా, సాయి సుదర్శన్‌ 35 పరుగులతో రాణించాడు. కీలక సమయంలో కెప్టెన్‌ గిల్‌ ఔట్‌ కావడంతో రషీద్‌ ఖాన్‌, తెవాటియాలు బ్యాట్‌తో రాణించడంతో గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టైటాన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన రషీద్‌ఖాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద అవార్డు దక్కింది.

Jyothi

Jyothi

Next Story