IND Vs WI: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

IND Vs WI: నాలుగో టీ20లో 59 పరుగుల తేడాతో విజయభేరి

Sriveni Erugu
Published on: 7 Aug 2022 7:09 AM IST
Great Win for India Against West Indies
X

IND Vs WI: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

IND Vs WI: వెస్టిండీస్‌ టూర్‌లో టీమిండియా సత్తా చాటింది. వన్డే సిరీస్‌ తరహాలోనే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 59 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగులుండగానే భారత్‌ సొంతం చేసుకుంది. బ్యాటర్ల సమష్టికృషికి బౌలర్ల మెరుపుబంతులు తోడవ్వడంతో నాలుగో మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. జట్టు విజయంలో పొదుపుగా పరుగులిచ్చిన బౌలర్ ఆవేశ్‌ ఖాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రిషభ్‌పంత్‌ 44 పరుగులు, రోహిత్‌ శర్మ 33 పరుగులు, సంజూ శాంసన్‌ 30 పరుగులు, సూర్య కుమార్‌ 24పరుగులు, దీపక్‌ హుడా 21 పరుగులు, అక్షర్ పటేల్‌ 20 పరుగులతో సమష్టిగా రాణించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను భారత్‌ బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ స్కోరుబోర్డును ముందుకు కదలనివ్వలేదు. వెస్టిండీస్ 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఫ్లోరిడాలో ఇదేవేదికపై ఈరోజు ఐదో టీ20 మ్యాచ్‌లో ఇరుజట్లు పోటీ పడనున్నాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story