Gautam Gambhir: ఫైనల్స్‌లో అజేయుడు.. గౌతమ్ గంభీర్ ఉన్నాడంటే విజయమే, ఆనందంలో భారత్ ఫాన్స్!

Gautam Gambhir: ఫైనల్ మ్యాచ్‌ల్లో గంభీర్‌కు ఓ ప్రత్యేకమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు గౌతీ పాల్గొన్న ప్రధాన టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఒక్కటీ కూడా ఓడిపోకపోవడం విశేషం.

Rishvik
Published on: 8 March 2026 5:04 PM IST
Gautam Gambhir
X

Gautam Gambhir: ఫైనల్స్‌లో అజేయుడు.. గౌతమ్ గంభీర్ ఉన్నాడంటే విజయమే, ఆనందంలో భారత్ ఫాన్స్!

Gautam Gambhir: గౌతమ్ గంభీర్.. ఈ పేరు చెప్పగానే భారత క్రికెట్‌లోని మెగా మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌ల్లో గంభీర్‌కు ఓ ప్రత్యేకమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు గౌతీ పాల్గొన్న ప్రధాన టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఒక్కటీ కూడా ఓడిపోకపోవడం విశేషం. అది భారత జట్టు అయినా లేదా ఐపీఎల్ టీమ్ అయినా.. జట్టుతో గంభీర్ ఉంటే విజయం ఖాయం. అందుకే క్రికెట్ అభిమానులు ఆయనను 'ఫైనల్స్ స్పెషలిస్ట్' అని కూడా అంటుంటారు.

ఫైనల్స్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్ :

గౌతమ్ గంభీర్ కెరీర్‌లో కీలకమైన ఫైనల్స్‌ను పరిశీలిస్తే.. అతని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించగా.. జట్టులో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 54 బంతుల్లో 75 రన్స్ చేశాడు. దాంతో భారత్ 257 రన్స్ చేసింది. పాక్ 152 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. టీమిండియా 5 రన్స్ తేడాతో గెలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. మూడో స్థానంలో వచ్చి 122 బంతుల్లో 97 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ టీమిండియా విజయంలో కీలకమైంది.

కేకేఆర్ కెప్టెన్, మెంటార్:

ఐపీఎల్‌లో కూడా గౌతమ్ గంభీర్ నాయకత్వంలో జట్టు విజయాలు సాధించింది. 2012, 2014 ఐపీఎల్ ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ట్రోఫీని గెలుచుకుంది. అనంతరం 2024 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ జట్టుకు కూడా గౌతీ మెంటార్ కాగా.. ఫైనల్లో కోల్‌కతా విజేతగా నిలిచింది.

కోచ్‌గా కూడా విజయాలు:

కేవలం ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా గౌతమ్ గంభీర్ విజయాలను అందుకున్నాడు. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లలో భారత జట్టు విజయం సాధించింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ల్లో గంభీర్ రికార్డు మరింత బలపడింది. ఫైనల్స్‌లో గౌతీ ఉన్నాడంటే.. మ్యాచ్ విన్ అయినట్లే.

2026 టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి:

ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ రికార్డు మరోసారి చర్చకు వచ్చింది. ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని గంభీర్ రికార్డు ఈసారి కూడా కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత క్రికెట్ అభిమానులు ఈ రికార్డు కొనసాగాలని ఆశిస్తున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ మధ్య జరగనుంది.

Rishvik

Rishvik

Next Story