దానిష్‌ కనేరియా ఉదంతంపై తీవ్ర స్పందించిన గంభీర్

దానిష్‌ కనేరియా ఉదంతంపై తీవ్ర స్పందించిన గంభీర్
x
Shoaib Akhtar, Gautam Gambhir
Highlights

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై క్రికెట్లో ప్రకంపనలు సృష్టిచాయి.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై క్రికెట్లో ప్రకంపనలు సృష్టిచాయి. మాజీ ఆటగాడైన దానిష్‌ కనేరియాపై ఆటగాళ్లు వివక్ష చూపెట్టేవారన్నాడు. కనేరియాను హిందూ మతస్తుడు అనే కారణంతో అతన్ని తీవ్రంగా అవమానించిన సందర్భాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత జట్టు మాజీ క్రికెటర్ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు.

షోయబ్‌ అక్తర్ క్రికెట్‌ ఆడే రోజుల్లో కులం, మతం, ప్రాంతం వారిగా సమస్య పాక్ క్రికెట్లో ఉండేదని గౌతమ్‌ గంభీర్ గుర్తు చేశాడు. కనేరియా హిందూ అనే కారణంతో అవమానించిన సందర్భాలు ఉన్నాయని గౌతమ్‌ గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక క్రికెటర్ పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న దేశంలో ఇలాంటి వివక్ష ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఒక క్రికెటర్‌కే ఇలాంటి వివక్ష ఎదురయితే పాకిస్థాన్ లో ఉంటున్న హిందువులు, సిక్కులు మైనారిటీల ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అనిల్ దల్పత్ తర్వాత పాకిస్థాన్ తరపు ఆడిన ఏకైక హిందూ క్రికెటర్‌ దానిష్‌ కనేరియా అని గౌతమ్ గంబీర్‌ కొనియాడాడు.

పాకిస్థాన్ టెస్ట్‌ క్రికెట్‌ జట్టులో కనేరియాపై వివక్ష చూపడం శోచనీయమన్నారు. భారత్ జట్టులో ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్ లాంటి క్రికెటర్లకు సముచిత స్థానం ఇచ్చిందన్నారు. మునాఫ్ పటేల్ తనకు మంచి స్నేహితుడని, దేశం గర్వించేలా తామంతా ఒకే జట్టులో ఆడామని తెలిపాడు. పాక్ నిజ స్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. ముస్లీంకు కూడా క్రికెటర్ అజారుద్దీన్‌కు కెప్టెన్సీ ఇచ్చి గౌరవించిన దేశం భారత్ అని గంబీర్ కొనియాడారు.

పాకిస్థాన్ తరపున ఆడిన దానిష్ కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టాడు.‎ 18 వన్డేలల్లో 15వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో కనేరియా 206 మ్యాచుల్లో 1020 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు.

అంతకుముందు అక్తర్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో పాక్‌ క్రికెటర్లు కొంతమంది వివక్షకు చూపేవారని. ఎప్పుడూ మతం , ప్రాంతం ఏమిటి అనే దానిపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ఏ రాష్ట్రానికి చెందినవాడివి అంటూ ఆరాలు తీసేవారని, జట్టులో ముగ్గురు క్రికెటర్లకు ఇదే పని అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్ లో కనేరియా కీలక పాత్ర పోషించాడు. అతడు జట్టుతో లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అయినా హిందూ కావడంతో అతన్ని పట్టించుకోలేదని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

అక్తర్ వ్యాఖ్యలపై కనేరియాను స్పందించారు.అక్తర్ వ్యాఖ్యల్లో వాస్తవముందని తెలిపాడు. తనకు అక్తర్, ఇంజమాముల్ హక్, యూసఫ్, యూనిస్ ఖాన్ మంచి మద్దతు ఇచ్చారని వెల్లడించారు. పాక్ తరపున ఆడినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories