Gautam Gambhir on MS Dhoni : ధోనీ భవిష్యత్‌పై గంభీర్ ఆసక్తికరమైన వాఖ్యలు!

Gautam Gambhir on MS Dhoni : ధోనీ భవిష్యత్‌పై గంభీర్ ఆసక్తికరమైన వాఖ్యలు!
x
Gautam Gambhir (L) and MS Dhoni during the 2011 World Cup final
Highlights

Gautam Gambhir on MS Dhoni : ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్‌ పైన ఆసక్తికరమైన వాఖ్యలు వాఖ్యలు చేశాడు ప్రస్తుత బీజేపీ ఎంపీ,

Gautam Gambhir on MS Dhoni : ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్‌ పైన ఆసక్తికరమైన వాఖ్యలు వాఖ్యలు చేశాడు ప్రస్తుత బీజేపీ ఎంపీ, ఇండియన్ టీం మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ .. తాను ఫిట్ గా ఉండి, ఫామ్‌లో, ఆటను ఎంజాయ్ చేస్తున్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగవచ్చునని అన్నాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో శనివారం మాట్లాడిన గంభీర్ ఈ వాఖ్యలు చేశాడు.

గత ఏడాది వరల్డ్ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమించినప్పటి నుంచి ధోని మళ్ళీ జట్టు తరుపున ఆడలేదు. గత ఏడాది కాలంగా క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న ధోని మళ్ళీ జట్టులోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ధోనీ మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. కానీ ఆ సమయంలో కరోనా వలన ఐపీఎల్‌ వాయిదా పడడంతో ధోని రిటైర్మెంట్‌ పైన రకరకాల వార్తలు వచ్చాయి. ఒకానొక క్రమంలో ధోనీ భార్య సాక్షి కూడా ఆ వార్తలను ఖండించారు.

ఈ క్రమంలో గంభీర్ ధోని భవిష్యత్‌పై మాట్లాడుతూ ధోనీ లాంటి ఆటగాడిపై చాలా మంది నిపుణులు ఒత్తిడి తెస్తారని, అయితే దానికి గల కారణం ధోని వయసు మాత్రమేనని అన్నాడు. ధోని ఇప్పటికి కూడా మంచి ఫామ్‌లో ఉండి, జట్టును ముందుకు నడిపించే శక్తి ఉందనుకుంటే ఆటలో కొనసాగవచ్చునని అన్నాడు. వయస్సు అనేది కేవలం సంఖ్యేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ధోని కెప్టెన్సీలో భారత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2007 నుండి 2016 వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మరియు 2008 నుండి 2014 వరకు టెస్ట్ క్రికెట్లో ధోని జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. ఇక ప్రపంచంలోని అన్ని ఐసిసి ట్రోఫీలను సాధించిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనినే కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories