Gautam Gambhir : హిస్టరీ క్రియేట్ చేసిన గౌతమ్ గంభీర్.. టీమిండియా కోచ్ గా సరికొత్త రికార్డు

Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత్. హెడ్ కోచ్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు (2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్) గెలిచిన తొలి భారతీయ కోచ్‌గా గౌతమ్ గంభీర్ చరిత్ర సృష్టించారు.

CR Reddy
Published on: 9 March 2026 6:13 AM IST
Gautam Gambhir
X

Gautam Gambhir Makes History

Gautam Gambhir : గౌతమ్ గంభీర్.. ఈ పేరు వింటేనే ప్రత్యర్థి జట్టుకు వెన్నులో వణుకు పుడుతుంది. మైదానంలో ఆటగాడిగా ఉన్నప్పుడు ఎలాగైతే అగ్రెసివ్‌గా ఉండి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడో, ఇప్పుడు హెడ్ కోచ్‌గా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్, భారత క్రికెట్ చరిత్రలో ఎవరూ అందుకోలేనంతటి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తక్కువ కాలంలోనే రెండు ఐసీసీ ట్రోఫీలను అందించడం మామూలు విషయం కాదు.

కోచ్‌గా గంభీర్ సరికొత్త చరిత్ర

భారత క్రికెట్ కోచింగ్ చరిత్రలో గంభీర్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గంభీర్, ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్ విజయంతో ఐసీసీ ట్రోఫీలను గెలిచిన మొట్టమొదటి భారతీయ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు ఐసీసీ ఫైనల్స్‌లోనూ టీమిండియా న్యూజిలాండ్‌నే మట్టికరిపించడం విశేషం. కివీస్ జట్టును ఏడిపించడంలో గంభీర్ స్ట్రాటజీలు అద్భుతంగా పనిచేశాయి.

ఆటగాడిగా.. కోచ్‌గా.. తిరుగులేని గంభీర్

గంభీర్ రికార్డు కేవలం కోచింగ్‌కే పరిమితం కాలేదు. గంభీర్ ఒక అరుదైన ఘనతను సాధించాడు.. ఆటగాడిగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన గంభీర్, ఇప్పుడు కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ప్లేయర్‌గా రెండు, కోచ్‌గా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. గంభీర్ వంటి ధీశాలి కోచ్‌గా ఉండటం టీమిండియాకు దొరికిన అతిపెద్ద వరం.

టీమిండియా హ్యాట్రిక్ రికార్డు

కోచ్ గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా అవతరించింది. ఫైనల్లో 255 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా, బౌలింగ్‌లోనూ కట్టుదిట్టంగా వ్యవహరించి కివీస్‌ను కోలుకోలేకుండా చేసింది. గంభీర్ అగ్రెసివ్ మైండ్‌సెట్, ఆటగాళ్లలో ఉన్న గెలవాలనే కసి ఈ గెలుపుకు మూల కారణాలు.

CR Reddy

CR Reddy

Next Story