Asia Cup: ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే

From Sachin Tendulkar to Shubman Gill A Look at Asia Cup
x

Asia Cup: ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే

Highlights

Asia Cup: ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే

Asia Cup: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆసియా కప్ 17వ సీజన్. ఈ టోర్నమెంట్ బీసీసీఐ ఆధ్వర్యంలో యూఏఈలో జరుగుతుంది. వచ్చే సంవత్సరం టీ20 ప్రపంచ కప్ ఉన్నందున, ఈసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ జట్టును ప్రకటించగా, మిగిలిన జట్లను త్వరలో ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రతి సీజన్‌లో టాప్ స్కోరర్లు

1. 1984 – సురీందర్ ఖన్నా (భారత్):

మొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో భారత బ్యాట్స్‌మెన్ సురీందర్ ఖన్నా 107 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

2. 1986 – అర్జున రణతుంగ (శ్రీలంక):

1986లో జరిగిన రెండో సీజన్‌లో శ్రీలంక దిగ్గజం అర్జున రణతుంగ 105 పరుగులు చేశాడు.

3. 1988 – ఇజాజ్ అహ్మద్ (పాకిస్థాన్):

మూడో సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాడు ఇజాజ్ అహ్మద్ 192 పరుగులు సాధించాడు.

4. 1990-91 – అర్జున రణతుంగ (శ్రీలంక):

నాలుగో సీజన్‌లో కూడా అర్జున రణతుంగ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి, 166 పరుగులు చేశాడు.

5. 1995 – సచిన్ టెండూల్కర్ (భారత్):

ఐదవ సీజన్ 1995లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 205 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

6. 1997 – అర్జున రణతుంగ (శ్రీలంక):

ఆరో సీజన్‌లో అర్జున రణతుంగ మళ్లీ సత్తా చాటి 272 పరుగులు చేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.

7. 2000 – మహ్మద్ యూసుఫ్ (పాకిస్థాన్):

2000లో జరిగిన ఏడవ సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ 295 పరుగులు చేశాడు.

8. 2004 – షోయబ్ మాలిక్ (పాకిస్థాన్):

ఎనిమిదో సీజన్‌లో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 316 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

9. 2008 – సనత్ జయసూర్య (శ్రీలంక):

శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 2008లో జరిగిన తొమ్మిదో సీజన్‌లో ఏకంగా 378 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

10. 2010 – షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్):

పదో సీజన్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 265 పరుగులు సాధించాడు.

11. 2012 – విరాట్ కోహ్లీ (భారత్):

11వ సీజన్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 357 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

12. 2014 – లహిరు తిరిమన్నే (శ్రీలంక):

12వ సీజన్‌లో శ్రీలంకకు చెందిన లహిరు తిరిమన్నే 279 పరుగులు చేశాడు.

13. 2016 – సబ్బీర్ రెహమాన్ (బంగ్లాదేశ్):

13వ సీజన్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సబ్బీర్ రెహమాన్ 176 పరుగులు సాధించాడు.

14. 2018 – శిఖర్ ధావన్ (భారత్):

14వ సీజన్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

15. 2022 – మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్):

15వ సీజన్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 281 పరుగులు చేశాడు.

16. 2023 – శుభ్‌మన్ గిల్ (భారత్):

16వ సీజన్‌లో భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ 302 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories