Controversy against IPL 2020 anthem: వాళ్లు నా పాట‌ను కాఫీ కొట్టారు: ర్యాపర్ క‌ృష్ణ కౌల్

Controversy against IPL 2020 anthem: వాళ్లు నా పాట‌ను కాఫీ కొట్టారు:  ర్యాపర్ క‌ృష్ణ కౌల్
x

Controversy against IPL 2020 anthem 

Highlights

Controversy against IPL 2020 anthem: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచుస్తున్న ఐపీఎల్ 2020 మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అంద‌రూ అనుకున్నట్టుగానే తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ప్రారంభం కానుంది.

Controversy against IPL 2020 anthem: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచుస్తున్న ఐపీఎల్ 2020 మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అంద‌రూ అనుకున్నట్టుగానే తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో అనేక నిబంధ‌నల‌ న‌డుమ ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది.

అయితే.. ఈ క్ర‌మంలో అభిమానులను ఆకట్టుకునేందుకు బీసీసీఐ ఓ థీమ్ సాంగ్‌ను మీడియా వేదికగా విడుదల చేసింది. 'ఆయేంగే హమ్‌ వాపస్‌' అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాట తనదేనని ప్రముఖ రాప్ సింగర్ కృష్ణ కౌల్ ఆరోపిస్తున్నాడు. తన 'దేఖ్ కౌన్ ఆయా వాపాస్ 'సాంగ్‌ను 'ఆయేంగే హమ్‌ వాపస్‌'‌గా పేరడి చేసి ఐపీఎల్ 2020 థీమ్ సాంగ్‌ను రూపొందించారని, తనకు ఏ మాత్రం క్రెడిట్ ఇవ్వాలేదని ట్విటర్ వేదికగా వాపోయాడు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బీసీసీఐ హెచ్చరించారు.

ఈ ఆరోప‌ణ‌ల‌పై ఐపీఎల్ 2020 సీజన్ థీమ్ సాంగ్ పాడిన ర్యాపర్ స్పందించాడు. తానే కేవలం పాటను మాత్రమే పాడనని, కంపోజ్ చేయలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేశాడు. మరి దీనిపై ఐపీఎల్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories