Virender Sehwag: నాకు కొంచెం తిక్కుంది అంటున్న వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag: పవన్ కళ్యాణ్ డైలాగులు చెబుతున్నా స్టార్ క్రికెటర్

admin1
Published on: 7 Sept 2021 3:52 PM IST
Former Indian Cricketer Virender Sehwag Says Power Star Pawan Kalyan Movie Dialogue
X

Virender Sehwag: నాకు కొంచెం తిక్కుంది అంటున్న వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag: టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోల కి వారి వారి స్టైల్ మరియు మ్యానారిజం ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ మరియు స్టైల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పుకోవడం లో అతిశయోక్తి లేదు. అలాంటిది ఒక సెలబ్రిటీ మరొక సెలబ్రిటీ ని లిమిటెడ్ చేస్తుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. అందులోనూ వేరే భాష హీరోలు తెలుగు హీరోల డైలాగులను చెప్తుంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్న ఒక క్రికెటర్ మన తెలుగు హీరోని ఇమిటేట్ చేయడం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ తెలుగులో చెప్పటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది" అని వీరేందర్ సెహ్వాగ్ చెప్తున్న వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఒక స్టార్ సెలబ్రిటీ నోటినుండి తమ అభిమాన హీరో డైలాగ్ వినడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా సంతోషించారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ను ఘనంగా జరుపుకున్న అభిమానులు ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

admin1

admin1

Next Story