IPL New Teams: ఐపీఎల్‌లో కొత్త టీమ్‌లు దక్కించుకునేందుకు ముందుకొచ్చిన 11 సంస్థలు

* రెండు జట్లను సొంతం చేసుకునేందుకు..అదానీ, మాంచెస్టర్ యునైటెడ్ ప్రీమియర్‌ లీగ్‌ ప్రయత్నాలు

Shilpa
Updated on: 23 Oct 2021 7:05 AM IST
For New Teams in IPL 11 Companies have Ready to Buy
X

ఐపీఎల్‌(ఫైల్ ఫోటో)

IPL New Teams: ఐపీఎల్‌‌లో కొత్త టీమ్‌లను ప్రకటించకముందే వాటిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. కొత్తగా వచ్చే రెండు జట్లను దక్కించుకునేందుకు 11 సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త జట్లు ఖరారు కాగానే ఆటగాళ్ల మెగా వేలం కూడా నిర్వహించనున్నారు. అయితే ఆ రెండు కొత్త జట్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

వాటి కోసం అహ్మదాబాద్‌, లఖ్‌నవూ నగరాలు పోటీలో ఉన్నాయి. అందులో ఒకదాన్ని సొంతం చేసుకునేందుకు అదాని గ్రూప్ ఆసక్తి చూపిస్తుండగా మరోదానిపై 'మాంచెస్టర్‌ యునైటెడ్‌ ప్రీమియర్‌ లీగ్' యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు సంస్థలు రూ.7వేల కోట్ల నుంచి 10వేల కోట్ల దాకా వెచ్చించి కొత్త ఫ్రాంఛైజీలను చేజిక్కించుకునే వీలుందని బీసీసీఐ అంచనా వేస్తుంది.

Shilpa

Shilpa

Next Story