India vs England 3rd ODI: ఆఖరి వన్డేలో కీలక మార్పులు?

India vs England 3rd ODI: ఇంగ్లండ్‌తో రేపు జరగనున్న ఆఖరి వన్డేలో కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.

Venkata Chari
Published on: 27 March 2021 9:07 PM IST
Few Changes in Team India vs England Final and Last ODI
X

టీమిండియా (ఫొటో)

India vs England 3rd ODI: ఇంగ్లండ్‌తో రేపు జరగనున్న ఆఖరి వన్డేలో కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్ 1-1తో సమం కావడంతో రేపు జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండో వ‌న్డేలో ప్ర‌త్య‌ర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఇద్ద‌రు స్పిన్న‌ర్ల పేల‌వ బౌలింగ్‌తోనే టీమిండియా ఓట‌మిపాలైంది.

ఈ నేప‌థ్యంలోనే లెగ్‌స్పిన్న‌ర్ చాహ‌ల్‌, ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌ను తుది జ‌ట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ప్ర‌ధాన పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌ర్వాతి వ‌న్డేకు కొన‌సాగ‌నున్నాడు. మ‌రో పేస‌ర్ శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చి యార్క‌ర్ స్పెష‌లిస్ట్ టీ న‌ట‌రాజ‌న్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. ఐతే బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ఎలాంటి మార్పులు జ‌రిగే ఛాన్స్ లేదు. అంద‌రూ త‌మ స్థానాల్లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story