Roger Federer: ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగిన ఫెడరర్‌

Roger Federer: మోకాలి గాయంతో తప్పుకుంటున్నట్లు ట్వీట్ * ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్న ఫెదరర్

Sandeep Eggoju
Published on: 14 July 2021 7:47 AM IST
Federer Withdraws From Olympics
X

టెన్నిస్ ప్లేయర్ ఫెడారర్ (ఫైల్ ఇమేజ్)

Roger Federer: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఒలింపిక్స్‌ నుంచి తప్పుకొన్నారు. మోకాలి గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. 'వింబుల్డన్‌ సందర్భంగా నా మోకాలిలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విశ్వక్రీడల నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నాన'ని 39 ఏళ్ల ఫెడరర్‌ ట్వీట్‌ చేశాడు. ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్న ఫెదరర్ ఒలింపిక్స్ లో నాలుగు సార్లు పోటీపడ్డాడు. బంగారు, వెండి పంతకాలు సాధించాడు. టోక్యో గేమ్స్ సింగిల్స్ విభాగంలో చివరకు బంగారు పతకాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని అభిమానులు భావించారు. 2012లో సింగిల్స్ లో రజతం, 2008లో డబుల్స్ లో స్వర్ణం సాధించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story