Fastest Hundred : 21 నిమిషాలు..27 బంతులు..100 పరుగులు..క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ

Fastest Hundred : 21 నిమిషాలు..27 బంతులు..100 పరుగులు..క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ
x
Highlights

క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ

Fastest Hundred :క్రికెట్ అంటేనే రికార్డుల మయం. సాధారణంగా మనం అత్యల్ప బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల గురించి వింటూ ఉంటాం. కానీ, తక్కువ నిమిషాల్లో సెంచరీ బాదిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. చాలా మందికి సమాధానం తెలియదు. కేవలం 21 నిమిషాల్లోనే వంద పరుగులు సాధించి, దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ చాపెల్. 1993లో నమోదైన ఈ రికార్డు నేటికీ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచిపోయింది.

సాధారణంగానే క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ అనగానే మనకు ఏబీ డివిలియర్స్ లేదా క్రిస్ గేల్ గుర్తుకు వస్తారు. కానీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో సమయం పరంగా చూస్తే గ్లెన్ చాపెల్ అందరికంటే ముందున్నాడు. 1993 జూలై 15 నుంచి 19 మధ్య లంకాశైర్, గ్లామోర్గాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. లంకాశైర్ తరపున ఆడిన గ్లెన్ చాపెల్, గ్లామోర్గాన్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. కేవలం 21 నిమిషాల వ్యవధిలో 27 బంతులను ఎదుర్కొని సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం.

ఈ సెంచరీ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఆ మ్యాచ్ డ్రా అయ్యే దిశగా సాగుతున్న తరుణంలో, స్కోరు వేగంగా పెంచి మ్యాచ్‌ను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో లంకాశైర్ తన ఆల్‌రౌండర్ చాపెల్‌ను ఓపెనర్‌గా పంపింది. చాపెల్ క్రీజులోకి వచ్చిన క్షణం నుండి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా, అంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీ పేరిట ఉన్న 26 నిమిషాల సెంచరీ రికార్డును చాపెల్ బద్దలు కొట్టాడు. నేటి ఆధునిక క్రికెట్ లో టీ20లు వచ్చినా, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు.

గ్లెన్ చాపెల్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇంతటి ఘనత సాధించినప్పటికీ, అతని అంతర్జాతీయ కెరీర్ మాత్రం దురదృష్టవశాత్తూ చాలా చిన్నదిగా ముగిసింది. 2006లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన చాపెల్, కేవలం 4 ఓవర్లు బౌలింగ్ చేయగానే గాయపడ్డాడు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత అతనికి మళ్ళీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అంటే, అతని అంతర్జాతీయ కెరీర్ కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితమైంది. అయినప్పటికీ, క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (నిమిషాల్లో) రికార్డు అనగానే గ్లెన్ చాపెల్ పేరు మొదటి వరుసలో కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories