logo
క్రీడలు

టీ-20 మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు.. జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాట..

Fans Flock for IND vs AUS T20 Match Tickets
X

టీ-20 మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు.. జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాట..

Highlights

Gymkhana Grounds: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది.

Gymkhana Grounds: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. దీంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంచనాలకు మించి అభిమానులు టికెట్ల కోసం రావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది.

మరోవైపు టికెట్ల విక్రయాల వద్ద సాంకేతిక లోపంతో ఆన్‌లైన్‌ పేమెంట్లు జరగడం లేదంటున్నారు అభిమానులు. దీంతో నగదు తీసుకుని టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో HCA తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాస్‌ల జారీ కూడా గందరగోళంగా మారడంతో HACపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Web TitleFans Flock for IND vs AUS T20 Match Tickets
Next Story