India vs England Second Test : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

Sandeep Reddy
Published on: 12 Aug 2021 3:36 PM IST
England Won The Toss Elected to Field First in India vs England Second Test
X

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ (ఫోటో: ట్విట్టర్)

India vs England Test: భారత్ - ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ వరణుడు రూపంలో ఫలితం తేలకుండానే ముగియడంతో రెండో టెస్ట్ మ్యాచ్ కి రెండు జట్లు సిద్ధం అయ్యాయి. ఇక గురువారం లార్డ్ వేదికగా జరగనున్న మ్యాచ్ కూడా వర్షం కారణంగా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయింది. తాజాగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ని ఎంచుకుంది. మొదటి మ్యాచ్ పిచ్ లాగే లార్డ్స్ మైదానం పిచ్ కూడా ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలిస్తుందని టాస్ గెలిచినా జట్టు బౌలింగ్ ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని టాస్ కి ముందే పిచ్ అనలిస్ట్ మిచెల్ హోల్డింగ్ తెలిపాడు.

ఇక ఇప్పటికే శార్దుల్ టాగూర్ గాయపడటంతో అతని స్థానంలో ఇషాంత్ శర్మకి నేటి మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లోని ప్లేయర్స్ లో శార్దుల్ స్థానంలో ఇషాంత్ మినహా అదే జట్టుతో భారత్ కొనసాగుతుంది. ఇక టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్ళమని భారత కెప్టెన్ కోహ్లి తెలిపాడు. భారత్ మరియు ఇంగ్లాండ్ తుది జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత జట్టు : విరాట్ కోహ్లి, అజింక్య రహనే, పూజార, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కే ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు : బర్న్స్, సిబ్లీ, హమీద్, రూట్ , బైర్ స్టౌ, బట్లర్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, రాబిన్సన్, వుడ్, ఆండర్సన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story