India Vs England Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

Sandeep Reddy
Updated on: 4 Aug 2021 3:39 PM IST
England won The Toss And Elected to Bat First in India Vs England First Test Match
X

భారత్-ఇంగ్లాండ్ టాస్ (ట్విట్టర్ ఫోటో)

India Vs England Test: నేడు భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కి సర్వం సిద్ధం అయింది. ఈరోజు జరగనున్న మ్యాచ్ కి వర్షం నుండి కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అభిమానులు మ్యాచ్ ని పూర్తి స్థాయిలో తిలకించడానికి రెడీ అయ్యారు. ఇక తాజాగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ని ఎంచుకుంది. టాస్ తరువాత మాట్లాడిన రూట్ మొదటి గంట సమయం పిచ్ లో వికెట్లు పడకుండా ఆడితే మంచి స్కోర్ సాధించగలమని బేర్ స్టౌ, సామ్ కర్రన్ తుది జట్టులో ఆడుతున్నట్లు తెలిపాడు.ఇక విరాట్ మాట్లాడుతూ మయంక్ స్థానంలో రాహుల్ ఆడుతున్నట్లు ఇక స్పిన్నర్ విభాగంలో అశ్విన్ కి బదులు జడేజాకి, ఇషాంత్ కి బదులు శార్దుల్ ఠాకూర్ కి తుది జట్టులో స్థానం కల్పించామన్నాడు.


భారత జట్టు: రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజిక్య రహనే, రిషబ్ పంత్, జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు: రోరి బర్న్స్ ,డొమినిక్ సిబ్లే, బేర్ స్టౌ, జాస్ బట్లర్, జో రూట్ (కెప్టెన్), డానియల్ లారెన్స్, జాక్ క్రావ్లే, సామ్ కర్రన్, ఒల్లీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story