T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లీష్ జట్టు జోరు

* ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో హ్యాట్రిక్‌ విజయం

Shilpa
Published on: 31 Oct 2021 7:04 AM IST
England Won the Match Against Australia with 8 Wickets in T20 World Cup 2021
X

టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లీష్ జట్టు జోరు(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లీష్ జట్టు జోరు మీద ఉంది. ఇప్పటికే రెండు విజయాలను సాధించిన ఆ జట్టు నిన్న ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ ఇచ్చిన 126 పరుగుల టార్గెట్‌ ఇంగ్లండ్‌ జట్టు 11.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ జోస్‌ బట్లర్ 5 ఫ్లోర్లు, 5 సిక్స్‌లతో వీర బాదుడు బాదాడు. ఓపెనర్ జేసన్‌ రాయ్‌ 22 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌కు ఇన్నింగ్స్ ఆరంభలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌ వెల్‌ ఒక్కో రన్స్ చేసి, వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు.

Shilpa

Shilpa

Next Story