England vs West Indies 3rd Test Highlights: తడబడి నిలబడిన ఇంగ్లాండ్!

England vs West Indies 3rd Test Highlights: తడబడి నిలబడిన ఇంగ్లాండ్!
x
England vs West Indies 3rd Test Day 1 Highlights
Highlights

England vs West Indies 3rd Test Highlights: విండిస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు ఆటలో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ తడబడి నిలబడింది.

England vs West Indies ౩ర్డ్ test Highlights: విండిస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు ఆటలో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ తడబడి నిలబడింది. వరుసగా మూడో టెస్టులోనూ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న విండిస్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై మొదటి నుంచి అధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. స్వింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై విండిస్ బౌలర్లు సత్తా చాటారు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికే సిబ్లీ మొదటి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీనితో ఒక పరుగుకే ఇంగ్లాండ్ మొదటి వికెట్ ని కోల్పోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రూట్ మరో ఓపెనర్ బర్న్స్‌తో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే పని పెట్టుకున్నాడు. దీనితో జట్టు స్కోర్ 50 దాటింది. ఈ క్రమంలో జట్టు స్కోర్ 55 వద్ద అనూహ్యంగా కెప్టెన్ రూట్ రనౌట్‌ అవ్వడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. ఆ తర్వాత వచ్చిన స్టోక్స్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. పేసర్‌ రోచ్‌ ఇన్‌స్వింగర్‌ కి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే వెస్టిండీస్‌ జంబో ఆటగాడు కార్న్‌వాల్‌ అద్భుతమైన క్యాచ్ తో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ బర్న్స్‌ను వెనక్కి పంపాడు. దీనితో ఇంగ్లిష్ జట్టు 122 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

టీ విరామం తర్వాత ఇంగ్లాండ్ జట్టు కొంచం కుదురుకుంది అని చెప్పాలి. బట్లర్‌ సహకారంతో పోప్‌ జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ విండిస్ బౌలర్లను విసిగించాడు. ఈ క్రమంలోనే పోప్‌ 77 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా, బట్లర్‌ వంద బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. దీనితో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. విండిస్ బౌలర్లలలో రోచ్‌ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌ ఒక వికెట్ తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories