ENG vs NZ 1st Test: రేపు కివీస్‌తో ఇంగ్లాండ్ పోరు

ENG vs NZ 1st Test: రేపు న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదలుకానుంది.

Venkata Chari
Published on: 1 Jun 2021 9:19 PM IST
England  Vs New Zealand 1st Test
X

ట్రోఫీతో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కెప్టెన్స్‌ (ఫొటో ట్విట్టర్)

ENG vs NZ 1st Test: రేపు న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, కీలక మ్యాచ్‌ ముందు ఇంగ్లీష్ కెప్టెన్ జోరూట్ గాయాల బారిన పడ్డాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో జోరూట్ ఆడేది లేనిది క్లారిటీ లేదు. నెట్స్‌లో జోరూట్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని కుడిచేతికి గాయమైంది.

న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌తో 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆడాల్సి ఉంది. అలాగే న్యూజిలాండ్, భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ముంబయికి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్నారు భారత క్రికెటర్లు. బుధవారం స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో ఇంగ్లాండ్‌కి బయల్దేరి వెళ్లనున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story