భారత పర్యటనకు విచ్చేసిన ఇంగ్లాండ్ జట్టు

*టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ *సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్ జట్టులో ఆందోళన

Samba Siva Rao
Published on: 31 Jan 2021 7:27 PM IST
భారత పర్యటనకు విచ్చేసిన ఇంగ్లాండ్ జట్టు
X

England tour of India 2021

జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో నాలుగు టెస్టులు ఆడేందుకు వచ్చింది. తొలి రెండు టెస్టులు చెన్నైలో జరగనున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు అక్కడే సన్నద్ధమవుతోంది. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా కట్టడి చేయాలన్నదానిపై ఇంగ్లాండ్ శిబిరం మల్లగుల్లాలు పడుతోంది. ఆ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. కోహ్లీని ఎలా అవుట్ చేయాలన్నది తెలియడంలేదని అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలో చిరస్మరణీయ సిరీస్‌లో ఆడని కోహ్లీ మరింత పరుగుల దాహంతో రగిలిపోతుంటాడని తెలిపాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడని లోటును ఈ సిరీస్ ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడని, ఆ అంశమే కోహ్లీలో అదనపు ప్రేరణ కలిగిస్తుందని మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో జరగనుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story