India Vs England: జో రూట్ ఔట్.. ఇంగ్లాండ్ టీ20 టీమ్ ఇదే

Samba Siva Rao
Published on: 11 Feb 2021 8:32 PM IST
India Vs England: జో రూట్ ఔట్.. ఇంగ్లాండ్ టీ20 టీమ్ ఇదే
X

Englandt20team

టీమిండియా ఇంగ్లాండ్ మధ్య త్వరలో ప్రారంభంకానున్న5 మ్యాచుల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టును ఈసీబీ ప్రకటించింది. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 జట్టుకు ఇయాన్‌ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. ఇంగ్లాండ్ భారత్ మధ్య పొట్టి ఫార్మాట్ మార్చి 12 నుంచి ప్రారంభంకానుంది. మార్చి 20తో టీ20 ఫార్మాట్ ముగియనుంది. టీ20లకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం వేదికానుంది.

ఫిబ్రవరి 26న ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు బయలుదేరుతుందని ఈసీబీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇంగ్లీష్‌ జట్టు మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌ లాంటి టీ20 స్పెషలిస్టులతో బలంగా ఉంది. ఇరు జట్ల మధ్య మార్చి 12, 14, 16,18, 20 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ 227పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇంగ్లాండ్‌ టీ20 జట్టు‌: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, జానీ బెయిర్‌స్టో, శామ్‌ కర్రన్‌, టామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, టాప్లే, మార్క్‌ వుడ్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story