KL Rahul: రాహుల్ పై బీర్ బాటిల్స్ విసిరిన ఇంగ్లాండ్ ప్రేక్షకులు

Sandeep Reddy
Updated on: 15 Aug 2021 5:36 PM IST
England Fans Throws Beer Bottles on KL Rahul in Between India Vs England Second Test Match
X

కె ఎల్ రాహుల్ (ట్విట్టర్ ఫోటో)

KL Rahul - Virat Kohli: ముళ్ళునూ ముళ్ళుతోనే తీయాలి అనే సామెత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి బాగా తెలిసినట్టు ఉంది. శనివారం భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో కోహ్లి చేసిన పనికి ఆ సామెత నిజమే అంటారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ పై ఇంగ్లాండ్ ప్రేక్షకులు వాళ్ళు తాగిన బీర్ బాటిల్స్ ను, గ్లాసులను విసిరేస్తూ నానా హంగామా చేశారు. ఎంతసేపటికి వారు అలాగే అరుస్తూ బాటిల్స్ ని విసిరేస్తుండటంతో విసుగు చెందిన రాహుల్ కెప్టెన్ కోహ్లికి ఆ విషయాన్నీ చెప్పాడు.

సహజంగానే దూకుడు స్వభావం ఉన్న కోహ్లి రాహుల్ పరిస్థితిని చూసి తిరిగి ఆ బాటిల్స్ ని వాళ్ళపై విసిరేయ్యమని సైగ చేయడం చూసిన ఇంగ్లాండ్ ప్రేక్షకులు ఆ తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కొంత మంది భారత ఆటగాళ్ళపై ఇటీవలె చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే ఇంగ్లాండ్ ప్రేక్షకులు ఇలా బీర్ బాటిల్స్ మరియు గ్లాసులనూ విసురడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ స్థానంలో కోహ్లి లాంటి ఆటగాడు ఉంటే కోపంలో నిజంగానే ఆ బీర్ బాటిల్స్ ని వాళ్ళ పైకి విసిరేవాడేమోనని పలువురు సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story