Anderson: మా పిచ్ మా ఇష్టం.. టీమిండియా పై అండర్సన్ షాకింగ్ కామెంట్స్

Sandeep Reddy
Updated on: 3 Aug 2021 4:02 PM IST
England Cricketer James Anderson Comments on Team India About The Grass Pitch in First Test Match Against India
X

జేమ్స్ అండర్సన్ (ట్విట్టర్ ఫోటో)

James Anderson: అయిదు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీంఇండియా జట్టు బుధవారం నాటింగ్ హోమ్ లో ఇంగ్లాండ్ జట్టుతో మొదటి టెస్ట్ మ్యాచ్ లో తలపడబోతుంది. ఇప్పటికే ప్రాక్టీసు మ్యాచ్ లో రాణించిన భారత బౌలర్లు మరియు బ్యాట్స్ మెన్ లతో టీమిండియా జట్టు బలంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం మ్యాచ్ ఒకరోజు ముందు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

గతంలో భారత్ టూర్ కి తమ జట్టు వెళ్ళినపుడు మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్ లను తమకి అనుకూలంగా ఉండేలా స్పిన్నర్స్ కు సహకరించేలా మార్చుకున్నారని, ఈ సారి తమ దేశానికి వస్తున్న ఇండియా జట్టుకు కూడా మేము అలాగే సమాధానం చెబుతామని అండర్సన్ మంగళవారం ఇంగ్లాండ్ లోని ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇక రేపటి మ్యాచ్ కోసం రెడీ చేసిన పిచ్ ఎక్కువ గడ్డితో ఉంటుందని, ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండేలా ఈ పిచ్ ని రెడీ చేసినట్టు అండర్సన్ తెలిపాడు. తమ దేశంలో జరుగుతున్న మ్యాచ్ కనుక మేము కూడా మాకు ఇష్టం వచ్చినట్లుగా అనుకూలంగా ఉండేలా చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ పిచ్ తో టీమిండియా జట్టుకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని, భారత జట్టులో పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్నారని వారు ఎలాంటి బంతులైన ఎదుర్కోగలరని అటు టీ 20 మ్యాచ్ లలోనే కాకుండా ఐపీఎల్ లో ఎలాంటి బంతినైన బౌండరీకి పంపే వారి ప్రదర్శన చూసిన తాను ఈ మాట చెబుతున్నానని అండర్సన్ మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశాడు. రేపటి నుండి మొదలు కానున్న టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 :30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story