ENG vs IND: మూడో టీ20లో టీమిండియా జట్టు పరాజయం

ENG vs IND: 17 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్

Jyothi
Published on: 11 July 2022 6:39 AM IST
England Beat India by 17 Runs in 3rd T20 Match
X

ENG vs IND: మూడో టీ20లో టీమిండియా జట్టు పరాజయం

ENG vs IND: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా జట్టు పరాజయం పొందింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్ తడబడ్డారు. 117 పరుగులతో జట్టును గెలిపించేందుకు సూర్యకుమార్ ప్రయత్నించాడు. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది.

ఇంగ్లండ్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో టూప్లే మూడు, డేవిండ్ విల్లే, క్రిస్ జోర్దాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Jyothi

Jyothi

Next Story