Du Plessis: ఆర్సీబీ గెలవదని డూప్లెసిస్ కు ముందే తెలుసు.. సాక్ష్యం ఇదిగో

Du Plessis: ఐపీఎల్ 2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది.

Dhatripriya
Published on: 24 May 2023 10:49 AM IST
Ee Sala Cup Nahi Old Video Gone Viral Again
X

Du Plessis: ఆర్సీబీ గెలవదని డూప్లెసిస్ కు ముందే తెలుసు.. సాక్ష్యం ఇదిగో

Du Plessis: ఐపీఎల్ 2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఆర్సీబీ ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది. ఈసారి ఎలాగైనా ఫైనల్ చేరి కప్పు గెలవాలని ఆ టీమ్ అనుకుంది..కానీ, కాలం కలిసి రాలేదు. ఇదిలా ఉంటే ఆర్సీబీ నిష్క్రమించడంతో ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కింగ్ కోహ్లీతో కలిసి ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ స్లోగన్ అయిన ఈ సాల కప్ నమ్డే అంటే ఈ సారి కప్ మనదే అని డుప్లెసిస్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ సాల కప్ నహీ అని చెప్పాడు. దీంతో పక్కనే ఉన్న కోహ్లీ సర్ది చెప్పాడు. నాటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆర్సీబీ ఫైనల్స్ కు చేరదని డుప్లెసిస్ కు ముందే తెలుసని అందుకే ఈ సాల కప్ నహీ అంటూ ముందే చెప్పేశాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా నాటి వీడియో మరోసారి ట్రెండ్ అవుతూ ఆర్సీబీ ఫ్యాన్స్ తో సహా అందరికి నవ్వులు తెప్పిస్తోంది.


Dhatripriya

Dhatripriya

Next Story