అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

ED Notice: అజారుద్దీన్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 11:34 AM IST
అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?
X

అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

ED Notice: అజారుద్దీన్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్‌ పీఎస్‌‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదయ్యింది. ఇందులో భాగంగా అజారుద్దీన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. HCA అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్‌పై ఆరోపణలున్నాయి.

హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో అగ్నిమాపక వ్యవస్థలు, జనరేటర్లు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఆచయనకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసుల ఆధారంగా ఆయన ఇవాళ ఈడీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story