కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్‌ ఇవ్వండి :ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు

కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్‌ ఇవ్వండి :ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు
x
Highlights

కరోనా వైరస్‌ వ్యాప్తి అంతర్జాతీయ క్రికెట్లో భారీ మార్పులు జరిగాయి. ఇందులో భాగంగా క్రికెట్ లో ఏ ఆటగాడికైనా వైరస్‌ సోకితే ‘కొవిడ్‌ 19 సబ్‌స్టిట్యూట్‌’ ఇవ్వాలని ఇంగ్లాండ్‌ కోరుతోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి అంతర్జాతీయ క్రికెట్లో భారీ మార్పులు జరిగాయి. ఇందులో భాగంగా క్రికెట్ లో ఏ ఆటగాడికైనా వైరస్‌ సోకితే 'కొవిడ్‌ 19 సబ్‌స్టిట్యూట్‌' ఇవ్వాలని ఇంగ్లాండ్‌ కోరుతోంది.అయితే ఇది టెస్టులకు మాత్రమేనని తెలిసింది. ఇలాంటి నిబంధన తీసుకురావాలని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఐసీసీని కోరింది. 'కొవిడ్‌-19 సబ్‌స్టిట్యూట్‌'కు అనుమతించే అవకాశం కనిపిస్తోంది.

కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఈ చర్య అడ్డుకుంటుందని భావిస్తోంది. సాధారణంగా బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు, స్వింగ్‌ చేసేందుకు బౌలర్లు ఉమ్మి రుద్దుతారు. బంతిని ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం వల్ల వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. జులైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందే అంగీకరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌లో పర్యటించేందుకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటన్‌ ప్రభుత్వ అనుమతి మేరకే సిరీస్‌ ఉంటుందని బోర్డు తెలిపింది. ఖాళీ స్టేడియాల్లోనే రెండు వేదికల్లో ఈ మ్యాచులు నిర్వహించనున్నారు

ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 సబ్‌స్టిట్యూట్‌పై కొన్ని అంశాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి అంగీకరించాలి' అని ఈసీబీ డైరెక్టర్‌ స్టీవ్‌ ఎల్‌వర్తీ అన్నారు. బయో సెక్యూర్‌ పరిసరాల్లో క్రికెట్‌ ఆడించేందుకు ఇంగ్లాండ్‌ సహా మరికొన్ని బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లందరికీ బంతిపై ఉమ్మితో రుద్దకూడదని ఐసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధన గురించి తెలియజేయాలని బోర్డులకు సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories