IPL 2024: నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్ మ్యాచ్ లు..

IPL 2024: సాయంత్రం 4 గంటలకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటెల్స్

Jyothi
Updated on: 23 March 2024 11:48 AM IST
Double Header Matches in IPL Today
X

IPL 2024: నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్ మ్యాచ్ లు.. 

IPL 2024: ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటెల్స్ మద్య సాయంత్రం నాలుగు గంటలకు చంఢీగడ్ ముల్లన్ పూర్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనున్నది. దాదాపు 15 నెలల తర్వాత రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ మొదటిసారిగా ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు.

మరో వైపు ఢిల్లీ జట్టుకు దూరమైన తర్వాత పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ కచ్చితంగా ఈ సారి తన జట్టును గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఇక హైదరాబాద్ వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నది. హాలిడే కావడంతో క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story