Maradona jersey: మారడోనా జెర్సీకి రూ. 70 కోట్లు

Diego Maradonas Jersey Sells for World Record Price
x

Maradona jersey: మారడోనా జెర్సీకి రూ. 70 కోట్లు

Highlights

Maradona jersey: తనదైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలిన అర్జంటీనా పుట్‌బాల్ దిగ్గజం మారడోనా...

Maradona jersey: తనదైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలిన అర్జంటీనా పుట్‌బాల్ దిగ్గజం మారడోనా ఈ లోకాన్ని వీడినా..అతడి జ్ఞాపకాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మారడోనా ధరించిన జెర్సీ వేలంలో రికార్డు ధర పలికింది. ఇంగ్లాండ్‌తో 1986లో జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్లో ధరించిన జెర్సీని కళ్లు చెదిరే మొత్తానికి కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌లో మారడోనా చేసిన తొలి గోల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‌గా వివాదాస్పదమైంది.

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లాండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు. అయితే దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఇటీవలే సోతీబై అనే ఆన్‌లైన్ వేలం సైట్‌లో విక్రయానికి పెట్టాడు. ఆ ఆన్‌లైన్ వేలంలో ఓ అజ్ఞాత అభిమాని ఈ జెర్సీని 71 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశాడు. భారత కరెన్సీలో 67 కోట్లా, 72 లక్షలు పెట్టి జెర్సీని కొనుగోలు చేశాడని సోతీబై సైట్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories