బ్రిటీష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఆ ఫొటో వెనుక సీక్రెట్ ఏంటంటే?

Hardik Pandya: భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2024 2:51 PM IST
Did Hardik Pandya in Relationship With British Singer, Photo Goes Viral in Social Media
X

బ్రిటీష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఆ ఫొటో వెనుక సీక్రెట్ ఏంటంటే?

Hardik Pandya: భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. భార్య నటాషా నుంచి విడాకులు తీసుకున్న పాండ్యా వార్తల్లో నిలిచారు. నాలుగేళ్ల వివాహ బంధానికి జూలైలో వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పాండ్యా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం పాండ్యా ఓ బ్రిటీష్ సింగర్ తో డేటింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది.

గ్రీస్‌లో ఉన్న ఓ లొకేషన్ నుంచి హార్దిక్‌తో పాటు సింగర్ జాస్మిన్ వాలియా ఒకే విధమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సింగర్ జాస్మిన్ .. బ్లూ కలర్ బికినీ.. బ్లూ షర్ట్‌తో .. ఓ పూల్ వద్ద ఫోటో దిగింది. ఆ ఫోటో బ్యాక్ డ్రాప్ లో మైకోనస్ సీనరి కనిపిస్తోంది.

అయితే అదే పూల్ వద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్టు చేశాడు. క్రీమ్ కలర్ ప్యాంట్, ప్రింట్ షర్ట్, సన్ గ్లాసెస్ తో హార్దిక్ వెరైటీ లుక్ లో ఉన్నాడు. అయితే వీరిద్దరూ కలిసి ఉన్నట్లు ఫోటోలో లేకపోయినప్పటికీ.. ఫోటో ఒకే లోకేషన్ లో ఉండడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చినట్లయింది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా స్పదించే వరకు వేచి చూడాల్సిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story