Subodh Bhati: క్రికెట్ లో ప్రపంచ రికార్డు.. టి-20లో డబుల్ సెంచరీ

Subodh Bhati: టి-20 క్రికెట్ లో ఢిల్లీ కుర్రాడు సుభోద్ భాటి డబుల్ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు.

Sandeep Reddy
Published on: 6 July 2021 3:23 PM IST
Delhi Cricketer Subodh Bhati Creates World History to become first cricket player to Score double century in T20 Match 2021
X

సుభోద్ భాటి (ఫైల్ ఫోటో)

Subodh Bhati: టి-20 క్రికెట్ లో ఢిల్లీ కుర్రాడు సుభోద్ భాటి డబుల్ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. తాజాగా జరిగిన దేశవాళి క్రికెట్ లో ఢిల్లీ ఎలెవన్ తరపున ఆడిన సుభోద్ భాటి కేవలం 79 బంతుల్లో 205 పరుగులు సాధించాడు. ఇందులో 17 సిక్స్ లు 17 ఫోర్లతో బౌలర్స్ కి ముచ్చెమటలు పట్టించాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి ఢిల్లీ ఎలెవన్ జట్టు కేవలం 20 ఓవర్లలో 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్ధి జట్టు ముందు ఉంచింది. ఇప్పటి వరకు టి20 క్రికెట్ లో 2013 లో పూణే వారియర్స్ పై 66 బంతుల్లో 175 పరుగుల సాధించిన క్రిస్ గేల్ రికార్డు ని అధిగమించిన సుభోద్ భాటి డబుల్ సెంచరీ తో క్రిస్ గేల్ ను వెనక్కి నెట్టాడు.

ఇక కేవలం 17 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఆటగాడు ఓపెనర్ గా వచ్చి చివరి వరకు అజేయంగా ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని ఈ ఫీట్ మన భారత రంజీ ఆటగాడు సాధించడం పట్ల పలువురు క్రీడా ప్రముఖులతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన ఈ 30 ఏళ్ళ కుర్రాడు 2015-16 లో దేశవాళీ క్రికెట్ లో అడుగుపెట్టి అటు ఓపెనర్ గా బ్యాటింగ్ లోనే కాకుండా తనదైన బౌలింగ్ తో జట్టు విజయాల్లో పాలు పంచుకుంటున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story