DC vs RR: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

DC vs RR: 20 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 May 2024 7:29 AM IST
Delhi Capitals Won On Rajasthan Royals By 20 Runs
X

DC vs RR: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

DC vs RR: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్లు భారీస్కోరు సాధించినప్పటికీ... రాజస్థాన్ రాయల్స్ దూకుడును కట్టడిచేసిన బౌలర్లు ఢిల్లీకి విజయాన్ని అందించారు. ఢిల్లీ జట్టు బౌలర్ కులదీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో కీలకమైన సమయంలో రెండు వికెట్లను పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది.

తొలి రెండు ఓవర్లు స్కోరు పెద్దగా చేయకపోగా, మూడో ఓవర్ నుంచి పరుగుల ప్రవాహం పారింది. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. సంజూ శాంసన్ జట్టును విజయతీరం చేర్చే సమయంలో బౌండరీలైన్ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ జట్టు విజయంపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 201 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story