GG vs DC: గుజరాత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

GG vs DC: 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Jyothi
Published on: 18 April 2024 6:52 AM IST
Delhi Capitals Win By 6 Wickets Against Gujarat
X

GG vs DC: గుజరాత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

GG vs DC: ఐపీఎల్‌లో శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ కు సొంతగడ్డపై 6 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదురైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పరమ చెత్తగా ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా, పరుగులు సాధించేందుకు గుజరాత్ జట్టు ఆపసోపాలు పడింది. ఓవర్లన్నీ పూర్తికాక ముందే చేతులెత్తేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4వికెట్ల నష్టంతో కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది.

Jyothi

Jyothi

Next Story