Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే...

Delhi Capitals: IPL-14 కు నూతన కెప్టెన్ ను ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్.

Venkata Chari
Published on: 30 March 2021 9:04 PM IST
Delhi Capitals: Rishabh Pant as a New Skipper of DC
X

రిషభ్ పంత్ (ఫొటో ట్విట్టర్)

Delhi Capitals: IPL-14 కు నూతన కెప్టెన్ ను ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఎన్నోరోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పై ఉత్కంఠ నేడు తెరపడింది. యువ బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను సారథిగా నియమించింది. రెగ్యుటర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఈమేరకు నూతన కెప్టెన్ గా రిషభ్ పంత్ కు ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు డీసీ టీం మేనేజ్‌మెంట్ తెలిపింది.

కాగా, రేసులో ఉన్న సీనియర్లు.. రహానే, అశ్విన్, ధావన్‌లను కాదని... రిషభ్ పంత్ కు కెప్టెన్ పదవిని అందించింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. రిషభ్ ఏ మేరకు టీం ను నడిపిస్తాడో చూడాలి మరి. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20, వన్డేల్లో రిషభ్ పంత్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సూపర్ ఫామ్ లో ఉన్న ఈ యువ ఆటగాడు... ఐపీఎల్ 2021 లో ఎలా రాణిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story