IPL 2022: ఐపీఎల్‌లో కరోనా కలకలం..

IPL 2022: ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది.

Arun Chilukuri
Published on: 15 April 2022 7:52 PM IST
Delhi Capitals Physio Patrick Farhart Tests Positive For Coronavirus
X

IPL 2022: ఐపీఎల్‌లో కరోనా కలకలం..

IPL 2022: ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బీసీసీఐ ఆందోళన చెందుతుంది. దాంతో అతడిని ఐసోలేషన్ కి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని ఢిల్లీ క్యాపిటల్స్ వైద్యబృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. గత ఐపీఎల్ సీజన్ లో కరోనా ఎలాంటి దుమారం రేపిందో తెలిసిందే. పలు జట్లలోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడడంతో ఆ సీజన్ అర్థాంతరంగా ఆగిపోయింది. దాంతో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించి, టోర్నీ పూర్తి చేశారు. తాజా సీజన్ లోనూ కరోనా కలకలం రేగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story