IPL 2023: ముంచేశావు కదయ్యా మనీష్ పాండే.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌పై ఫ్యాన్స్ ఫైర్..

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసినట్టే..ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.

Arun Chilukuri
Published on: 11 May 2023 11:27 AM IST
Delhi Capitals Fans Trolls Manish Pandey
X

IPL 2023: ముంచేశావు కదయ్యా మనీష్ పాండే.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌పై ఫ్యాన్స్ ఫైర్..

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసినట్టే..ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఒకసారి, పంజాబ్ కింగ్స్ తో రెండు సార్లు ఢిల్లీ జట్టు ఆడాలి..ఈ మూడు మ్యాచుల్లో గెలిచినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం కష్టమే..ఎందుకంటే ఈ జట్టుకు 14 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇదిలా ఉంటే, చెన్నైతో మ్యాచ్ పోవడానికి ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాండేనే కారణమని ఢిల్లీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ రనౌట్ కు మనీష్ కారణమంటూ దెప్పిపొడుస్తున్నారు.

ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ లో చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే బంతి వేయగా కవర్స్ దిశగా ఆడిన మనీష్ రన్ కు కదిలాడు. దీంతో అవతలి ఎండ్ లో మార్ష్ పరిగెత్తాడు. కానీ మనీష్ ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో మార్ష్ సగం పిచ్ వరకు చేరుకున్నాడు. వెనుదిరిగే అవకాశం లేకపోయింది. ఫీల్డర్ అజింక్య రహానే బంతి పట్టుకొని నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు పరుగొత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు.

మార్ష్ రనౌట్ కు కారణమైన మనీష్..సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడా అంటే అదీ లేదు. 29 బంతులు ఆడి 27 పరుగులు మాత్రమే చేశాడు..అంటే బంతికి కనీసం ఒక్క పరుగుచొప్పున కూడా మనీష్ చేయలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయానికి మనీష్ కారణమంటూ ఆ జట్టు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మనీష్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ చూపించావు కదయ్యా అంటూ మనీష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తన ఆటలో ఢిల్లీ జట్టుకు సమాధి కట్టేశాడంటూ పోస్టులు పెడుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story