DC Vs PBKS: సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్ టీమ్

DC Vs PBKS: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయదుందుబి

Rama Rao
Published on: 21 April 2022 6:17 AM IST
Delhi Capitals Beat Punjab Kings By Nine Wickets
X

DC Vs PBKS: సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్ టీమ్

DC Vs PBKS: ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం అదరగొట్టింది. కరోనా వైరస్ కలకలం రేపుతున్న ప్రస్తుత తరుణంలో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయదుందుబి మోగించింది. ఢిల్లీ బౌలర్ల కట్టడితో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్ లక్ష్యాన్ని కాపాడుకోవడంలోనూ పోరాట పటిమ కనబర్చలేకపోయింది. తొమ్మిది వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ 20 ఓవ్రలలో 115 పరుగలకు కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్ల ప్రదర్శనతో పంజాబ్ బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. జితేష్ శర్మ 32 పరుగులు, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 24 పరుగులు చేశారు. మిగతా వారెవరూ చెప్పుకోదగిన స్కోర్లు చేయలేకపోయారు. ఆ తర్వత లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 10.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ 30 బంతుల్లో 60 పరుగులు. పృథ్విషా 20 బంతుల్లో 41 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ దక్కింది. ఇవాల డివై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై, చెన్నై మధ్య పోరు జరగనుంది.

Rama Rao

Rama Rao

Next Story