IPL 2021: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ

IPL 2021: చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం * 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ఢిల్లీ

Sandeep Eggoju
Updated on: 11 April 2021 1:57 PM IST
Delhi Capital Win In CSK vs DC Match
X
ఢిల్లీ క్యాపిటల్స్ (ఫైల్ ఇమేజ్)

IPL 2021: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్ చెలరేగడంతో 3 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. షా 72 పరుగులు చేయగా.. ధావన్ 85 రన్స్ చేశాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రావో ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నైసూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌ ఫెయిల్ అయిన సమయంలో మిడిలార్డర్ బ్యాట్స్‌ మెన్‌ రాణించడంతో చెన్నై 188 పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో అవీశ్‌ ఖాన్‌, క్రిస్‌ వోక్స్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, టామ్‌ కరన్‌ తలో వికెట్ తీశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story