IPL 2020 SRH vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్!

IPL 2020 SRH vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్!
x
Highlights

IPL 2020 SRH vs KKR: ఇవ్వాళ అబుదాబి వేదికగా హైదరాబాద్‌, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన వార్నర్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. దీనితో కలకత్తా జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది.

IPL 2020 SRH vs KKR: ఇవ్వాళ అబుదాబి వేదికగా హైదరాబాద్‌, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన వార్నర్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. దీనితో కలకత్తా జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఇప్పటివరకు హైదరాబాద్‌ ఎనమిది మ్యాచ్ లు ఆడగా, అందులో మూడింటిలో నెగ్గి అయిదింటిలో ఒడిపోయింది. అటు కలకత్తా జట్టు నాలుగు మ్యాచ్ లో నెగ్గి, నాలుగింటిలో ఓడింది. కాగా, వార్నర్‌ సేన ఈ మ్యాచ్‌లో గెలుపొంది‌ కోల్‌కతాను అధిగమించి నాలుగో స్థానంలో నిలవాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు :

హైదరాబాద్‌ జట్టు: డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, బాసిత్‌ థంపి

కోల్‌కతా జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, పాట్‌కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌

Show Full Article
Print Article
Next Story
More Stories