RP Singh: టీమిండియా క్రికెట‌ర్ ఆర్పీ సింగ్ ఇంట విషాదం

RP Singh: తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ కరోనా బారిన పడి మృతి చెందారు.

Samba Siva Rao
Published on: 12 May 2021 6:49 PM IST
Cricketer RP Singh Father Passes Away due to Corona
X

క్రికెటర్ ఆర్ఫీ సింగ్ తండ్రి కరోనాతో మృతి

RP Singh: కరోనా మహమ్మారి క‌ల్లోకం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంత‌క వైరస్ సామాన్యుల నుంచి సెల‌బ్రిటిల వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. దేశంలో ఈ వైర‌స్ బారిన ప‌డి ఎందరో అమ‌యాకులు ప్రాణాలు విడిచారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ కరోనా బారిన పడి మృతి చెందారు.

ఈ విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన తండ్రి మ‌ర‌ణించార‌ని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నానని ఆర్పీ సింగ్ చెప్పాడు. కొవిడ్ తో పోరాటం చేస్తూ తన తండ్రి ఈరోజు తుదిశ్వాస విడిచారని తెలిపాడు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని అందరినీ కోరుతున్నానని చెప్పాడు. మ‌రోవైపు, ఆర్పీ సింగ్ తండ్రి మృతి పట్ల పలువురు క్రికెట్లరు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎంతో బాధ కలుగుతోందని సురేశ్ రైనా అన్నాడు. ఈ కష్ట కాలంలో ధైర్యంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షలే గిబ్జ్ ధైర్యం చెప్పాడు.

రుద్ర‌ప్ర‌తాప్ సింగ్( ఆర్పీ సింగ్ ) టీమిండియా త‌ర‌పున 58 వ‌న్డేలకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2005లో వ‌న్డేల్లో అరంగేర్రం చేసిన ఆర్పి 58 వ‌న్డేల్లో 69 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 14 టెస్టుల్లో 40 వికెట్లు ద‌క్కించుకున్నాడు. 10 టీ20లు కూడా ఆడాడు 15 వికెట్లు ప‌డ‌గొట్టాడు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story