Rishabh Pant: ఉత్త‌రాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ రిషబ్ పంత్ నియామకం

* ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ఉత్త‌రాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి

Sandeep Reddy
Published on: 20 Dec 2021 12:51 PM IST
Cricketer Rishabh Pant Appointed as Uttarakhand Brand Ambassador
X

Rishabh Pant: ఉత్త‌రాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ రిషబ్ పంత్ నియామకం

Rishabh Pant: ఐపీఎల్ లో తన బ్యాటింగ్ తో అదరగొట్టి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న 24 ఏళ్ల యంగ్ ప్లేయర్ రిష‌బ్ పంత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుండి జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. తాజాగా రిషబ్ పంత్ కు ఉత్త‌రాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉత్త‌రాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ రిషబ్ పంత్ ని నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఇక ఈ విషయాన్ని సిఎం పుష్కర్ సింగ్ ధామి..రిషబ్ పంత్ కి వీడియో కాల్ చేసి తెలిపారు. ఇక ఉత్త‌రాఖండ్ రాష్ట్ర యువత ఆటలపై, ఆరోగ్యంపై దృష్టిపెట్టేలా అవగాహన కల్పించడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని రిషబ్ పంత్ తెలిపాడు. అంతేకాకుండా ఉత్త‌రాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినందుకు ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపాడు రిషబ్ పంత్.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story