Cricket: సచిన్‌ కొదమసింహం.. సెహ్వాగ్ కామెంట్స్‌పై యువీ కౌంటర్

Road Safety World Series
x

స‌చిన్ టెండూల్కర్‌, సెహ్వాగ్ ఫైల్ ఫోటో 

Highlights

Cricket: టీమిండియా మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వీడియోను సెహ్వాగ్ పోస్ట్ చేశాడు.

Cricket: స్టేడియంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే టీమిండియా మాజీ ప్లేయర్‌ స‌చిన్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ వీడియోను సెహ్వాగ్ పోస్ట్ చేశారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా ప‌లు దేశాల మాజీ క్రికెట‌ర్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ మ్యాచ్ ఆడ‌నుంది. దాంతో తమ అభిమానులకు మునుపటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు.

ఫిజియో పర్యవేక్షణలో...

ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ ప్రక్రియలో భాగంగా సచిన్‌ తాజాగా తన ఎడమ మోచేతికి సూదులు గుచ్చుకొని ఫిజియో పర్యవేక్షణలో సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న సెహ్వాగ్‌.. సచిన్‌, యువీతో కలిసి సరదాగా జోకులు పేల్చాడు. 'ఈయన మన దేవుడు. క్రికెట్‌ ఆడీ ఆడీ చేతులమీద వెంట్రుకలు కూడా రాలేదు. ఇప్పుడు సూదులు గుచ్చుకొని తర్వాతి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు' అని హాస్యం పండించాడు.

యువరాజ్‌ సింగ్‌ను పలకరిస్తూ...

తర్వాత పక్కనే కూర్చున్న యువరాజ్‌ సింగ్‌ను పలకరిస్తూ 'మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడో లేదో తెలుసుకుందాం' అని అన్నాడు. దానికి యువీ దీటైన జవాబిచ్చాడు. 'భాయ్‌ నువ్వు ఒక సింహం. ఆయన(సచిన్‌) ఒక కొదమ సింహం' అని దిగ్గజాలను కీర్తించాడు. ఆపై సెహ్వాగ్‌ మళ్లీ సచిన్‌ను ఉద్దేశించి.. 'సర్‌ మీ సన్నద్ధత ఎలా ఉంది' అని అడిగాడు. సచిన్‌ స్పందిస్తూ..'నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా?' అని సరదాగా అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మళ్లీ వీరూ అందుకొని. 'మీరు ఎక్స్‌పర్ట్‌ కదా.. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మ్యాచ్‌కు సిద్ధమయ్యారా' అని ప్రశ్నించాడు. సచిన్‌ సమాధానమిస్తూ 'అందుకోసమే ప్రయత్నిస్తున్నా' అని అన్నాడు. ఇంకేముందు అభిమానులకు పండగే అయ్యింది వీరి సంభాషణ. సోషల్ మీడియాలో తెగ వెరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories