Tokyo Olympics: భార‌త క్రీడాకారుల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు

Tokyo Olympics: జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri
Published on: 23 July 2021 4:00 PM IST
CM KCR Wishes Indian Athletes for Their Best in Tokyo Olympics
X

Tokyo Olympics: భార‌త క్రీడాకారుల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు

Tokyo Olympics: జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం ఆకాంక్షించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story