logo
క్రీడలు

IPL 2021: ఐపీఎల్‌ నుంచి క్రిస్ గేల్ ఔట్

Chris Gayle Leaves IPL Due to Bubble Fatigue
X

IPL 2021: ఐపీఎల్‌ నుంచి క్రిస్ గేల్ ఔట్

Highlights

IPL 2021: స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు

Chris Gayle - IPL 2021: స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్ లెవన్ తరపున ఆడుతున్న అతను టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బయో బబుల్ వాతావరణం ఆంక్షలను తట్టుకోలేక టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. ఐపీఎల్ రెండో ఎడిషన్‌లో గేల్ రెండ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో గేల్ మానసిక వత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాడు.

ఇటీవల సీపీఎల్‌లో ఆడిన గేల్ అక్కడ కూడా బయో బబుల్ వాతావరణంలోనే ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి బబుల్ లో ఉన్నానని ఈనేపథ్యంలో మానసికంగా బలోపేతం కావాలనుకుంటున్నాని గేల్ ప్రకటించాడు. దుబాయ్‌లోనే బ్రేక్ తీసుకుంటానని, వరల్డ్ కప్ టోర్నీలో విండీస్‌కు హెల్ప్ చేయాలనుకుంటున్నట్లు గేల్ చెప్పాడు.

Web TitleChris Gayle Leaves IPL Due to Bubble Fatigue
Next Story