IPL 2021 - SRH vs CSK: హైదరాబాద్‌పై చెన్నై విజయం

Chennai Super Kings Won the Match Against Sunrisers Hyderabad IPL 2021 | Cricket News Today
x

హైదరాబాద్‌పై చెన్నై విజయం

Highlights

IPL 2021 - SRH vs CSK: *ప్లే ఆఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ *మరోసారి నిరాశపరిచిన ఎస్‌ఆర్‌హెచ్

IPL 2021 - SRH vs CSK: SRH తమ అభిమానులను మరోసారి నిరాశ పరిచింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని మూట గట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. సీఎస్‌కే బాలర్లలో హాజిల్‌వుడ్‌ 3, బ్రావో 2 వికెట్లు పడగొట్టారు. ఇక.. 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన CSK.. 19.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది.

సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు కూల్‌ కెప్టెన్ ధోనీ. దీంతో.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది చెన్నై. SRH బౌలర్లలో హోల్డర్‌కు మూడు వికెట్లు దక్కగా.. రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్ తీశాడు. ఈ గెలుపుతో CSK ప్లే ఆఫ్‌కు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories