IPL 2021 - CSK vs DC: తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై విజయం

IPL 2021 - CSK vs DC: *ఢిల్లీని చిత్తుచేసి, ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై టీం *వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరిన చెన్నై టీం

Shilpa
Updated on: 11 Oct 2021 9:23 AM IST
Chennai Super Kings Won Over Delhi Capitals IPL 2021 Highlights
X

CSK vs DC: తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై విజయం(ఫైల్ ఫోటో)

IPL 2021 - CSK vs DC: హోరాహోరీగా సాగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై విక్టరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ధోనిసేన విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరినట్లయ్యింది.

రాబిన్ ఊతప్ప హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి చెన్నై టీంను గెలిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కానీ చెన్నై జట్టు సునాయసంగా టార్గెట్‌ను రీచ్‌ అయ్యింది.

Shilpa

Shilpa

Next Story